ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేష్ దరఖాస్తు.. మల్లారెడ్డిని ఆటాడుకున్నారుగా!

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:51 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డికి మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్వరం పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై.. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఎవరైనా మాట్లాడితే చాలు.. నిమిషాల్లో మీడియా మీట్‌లు పెట్టేసి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ఆ మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బండ్ల.. ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డిపై దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

దరఖాస్తు..!

శుక్రవారం నాడు గాంధీ భవన్‌కు వచ్చిన బండ్ల.. మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డికి మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి.. మల్లారెడ్డి ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానన్నారు. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా తీసుకోమన్నారు.

గౌరవమేదీ మల్లన్నా..!

డబ్బు ఉందనే అహంకారంతో మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనే పదానికి గౌరవం ఇవ్వాలి. సీఎంను ఏకవచనంతో సంబోధిస్తున్నారు.. ఇది పద్ధతి కాదు.ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు.. సీఎం రేవంత్ రెడ్డిని టచ్ కూడా చేయలేరు. రోజుకు 20 గంటలు పనిచేస్తున్న ఏకైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం.. అర్ధ రహిత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన అద్బుతంగా ఉంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుంది అని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 02 , 2024 | 12:48 PM

Advertising
Advertising