ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhatti Vikramarka: మెజార్టీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తాం

ABN, Publish Date - Jan 11 , 2024 | 10:00 PM

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు.

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పలు విషయాలను మీడియాకు భట్టి విక్రమార్క వివరించారు. గురువారం నాడు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై అధిష్టానం దిశానిర్దేశం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందెలా ప్రణాళికలు, యాక్షన్ ప్లాన్ రూపొందించి పనిచేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారన్నారు. సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని అభ్యర్థించామని.. భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని... మల్లికార్జున ఖర్గే కూడా సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క చెప్పారు.

Updated Date - Jan 11 , 2024 | 10:00 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising