ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఛార్జర్ ఇవ్వకపోతే ఇలా చేశాడేంటీ.. ?

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:00 PM

దుండిగల్ పరిధిలో శాంత అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అక్కడున్న స్థానికులకు మద్యం విక్రయిస్తోంది. ఇటీవల శాంత వద్దకు కమల్ కుమార్ అనే యువకుడు వచ్చాడు. మొబైల్ ఛార్జర్ ఇవ్వాలని శాంతను అడిగాడు. ఛార్జర్ ఇవ్వనని శాంత అతనితో తెగేసి చెప్పింది. దాంతో కమల్ కోపోద్రిక్తుడు అయ్యాడు. శాంతపై విచక్షణరహితంగా దాడి చేశాడు.

Dundigal News

హైదరాబాద్: మంచి అన్నది లేకుండా పోతుంది. చిన్న విషయాలకే గొడవ పడటం కామన్ అయిపోయింది. మరికొందరైతే ఏకంగా హత్యలు చేస్తున్నారు. దుండిగల్ పరిధిలో జరిగిన ఘటన విస్తుగొలిపింది. మొబైల్ ఛార్జర్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళను మట్టుబెట్టాడు యువకుడు. ఆ గొడవ, హత్య సీసీటీవీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తే.. మొబైల్ ఛార్జర్ కోసం అని నిందితుడు చెప్పడంతో చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టారు.



బెల్ట్ షాపు నిర్వహిస్తూ..

దుండిగల్ పరిధిలో శాంత అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అక్కడున్న స్థానికులకు మద్యం విక్రయిస్తోంది. ఇటీవల శాంత వద్దకు కమల్ కుమార్ అనే యువకుడు వచ్చాడు. మొబైల్ ఛార్జర్ ఇవ్వాలని శాంతను అడిగాడు. ఛార్జర్ ఇవ్వనని శాంత అతనితో తెగేసి చెప్పింది. దాంతో కమల్ కోపోద్రిక్తుడు అయ్యాడు. శాంతపై విచక్షణరహితంగా దాడి చేశాడు. కుమార్ కొట్టడంతో శాంత కింద పడిపోయింది. ఆమెకు గాయాలు కాగా అరవడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారు వస్తారని భావించి, శాంత నోరు మూసివేశాడు. నోరు మూసి, గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మెల్లిగా అక్కడినుంచి జారుకున్నాడు.


పోలీసులకు సమాచారం..

శాంత విగతజీవిగా కనిపించడంతో స్థానికులు ఆశ్చర్య పోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరుగు పొరుగు వారిని విచారించారు. సీసీటీవీ ఫుటేజీ చూడగా అసలు విషయం తెలిసింది. కమల్ కుమార్ దాడి చేయడం కనిపించింది. తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. శాంత హత్య గురించి ఆరా తీయగా.. మొబైల్ ఛార్జర్ ఇవ్వలేదని, అందుకే హత్య చేశానని వివరించారు. దాంతో కమల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. హత్య నేరం కింద అభియోగం మోపి కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 03:16 PM

Advertising
Advertising
<