ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం..

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:01 PM

లోక్‌సభ ఎన్నికల‌కు తెలంగాణ బీజేపీ సన్నాహకాలు ప్రారంభించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో కిషన్‌రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల‌కు తెలంగాణ బీజేపీ సన్నాహకాలు ప్రారంభించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో కిషన్‌రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిటీ ఒక్కో స్థానం నుంచి మూడు పేర్లు అధిష్ఠానానికి పంపనుంది. కాగా ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. సిట్టింగ్ స్థానలపై స్పష్టతకు వచ్చింది.

సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్.. బండి సంజయ్, నిజామాబాద్‌.. ధర్మపురి అరవింద్, చేవెళ్ల.. కొండా విశ్వేశ్వరెడ్డి, భువనగిరి.. బూర నర్సయ్య గౌడ్ పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈటల రాజేందర్ ఎక్కడ నుంచి పోటీచేయాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే మెదక్ లేదా జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ఈటలకు బీజేపీ నాయకత్వం సూచిస్తోంది. మల్కాజ్‌గిరి సీటు చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి, మల్కా కొమరయ్య, మురళీదరరావు ఆశిస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ పోటీపడుతున్నారు. నగర్ లోక్ సభ స్థానం కోసం పార్టీలో ఉన్న ముఖ్యనేతల మధ్య పోటీ నెలకొంది. ఖమ్మం టికెట్ రేసులో ఈవీ రమేష్, గల్లా సత్యనారాయణ, రంగా కిరణ్, వాసుదేవరావులు ఉన్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట చేరికలను ప్రోత్సాహించాలని బీజేపీ నిర్ణయించింది.

Updated Date - Feb 12 , 2024 | 12:01 PM

Advertising
Advertising