ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ కీలక నిర్ణయం..

ABN, Publish Date - Aug 26 , 2024 | 09:04 PM

మహా నగరం హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి అక్రమించిన నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారి నిర్మాణాలను కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్: మహా నగరం హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి అక్రమించిన నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారి నిర్మాణాలను కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై విపక్ష బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి వారి ఆస్తుల కూల్చివేతపై పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బడా బాబుల అక్రమ కట్టడాలు కూల్చివేతల వరకు ఓకే.. కానీ పేదల జోలికి వస్తే ఊరూకోబోమని బీజేపీ చెబుతోంది. ఈ మేరకు పోరాటానికి సిద్ధమవుతోంది.


హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతల కీలక సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షుల సమావేశంలో హైడ్రా కూల్చివేతలపై చర్చించారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఎఫ్‌టీఎల్‌లో పట్టాభూములు ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాలే టార్గెట్ హైడ్రా కూల్చివేతలు ఉంటే సహించేది లేదని, పెద్దోళ్ల అక్రమ కట్టడాల కూల్చివేతలను సమర్థిస్తున్నట్టు స్పష్టం చేసింది.


సలకం చెరువులో ఒవైసీ కాలేజీ!

మరోవైపు.. సలకం చెరువులో ఒవైసీ కాలేజీ నిర్మాణం జరిగిందంటూ బీజేపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ బ్రదర్స్‌ ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌ ఫొటోలను తెలంగాణ బీజేపీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి నుంచి.. 2024లో ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజీ నిర్మాణం వరకు అంటూ గూగుల్ మ్యాప్ ఫొటోలను జత చేసింది. ఈ నిర్మాణాలపై చర్య తీసుకునే ధైర్యం హైడ్రా చేయగలదా? అని బీజేపీ ప్రశ్నించింది.

Updated Date - Aug 26 , 2024 | 09:06 PM

Advertising
Advertising
<