ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jithender reddy: ‘అది నా అడ్డే’... ఎంపీ టికెట్‌పై జితేందర్‌ హాట్ కామెంట్స్

ABN, Publish Date - Feb 03 , 2024 | 10:00 AM

Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్‌కు సంబంధించి బీజేపీ నేత జితేందర్ రెడ్డి (BJP Leader Jithender Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ‘‘మహబూబ్‌నగర్ గడ్డ.. జితేందర్ రెడ్డి అడ్డా. మహబూబ్‌నగర్ పార్లమెంట్ టికెట్ నాదే. నాకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదముంది. టికెట్ కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. డీకే అరుణకు టికెట్ ఇస్తే.. ఆమెకు సహరించే విషయంపై అప్పుడు ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.


పార్టీ బలోపేతం కోసం తాను ఏం చేశానో పార్టీ పెద్దలకు తెలుసన్నారు. తన పనితనం ఆధారంగానే మహబూబ్‌నగర్ టికెట్ వస్తుందని డిమాండ్ చేశారు. రెండు సార్లు ఎంపీగా మహబూబ్‌నగర్ అభివృద్ధికి కృషి చేశానన్నారు. ‘‘నా కుమారుడి ఇన్కం టాక్స్ వేరు. నా ఇన్కం టాక్స్ వేరే. నా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదని ఏమీలేదు’’ అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ అవగాహన ఉందన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై గతంలో సీబీఐ విచారణ కోరి‌న సీఎం రేవంత్ (CM Revanth Reddy).. ఇప్పుడు ఎందుకు విచారణ కోరటం లేదని ప్రశ్నించారు. మోదీ (PM Modi) చరిష్మా ముందు కాంగ్రెస్ నిలబడలేదని.. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 03 , 2024 | 10:16 AM

Advertising
Advertising