TTDP: టీడీపీవైపు చూస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: దుర్గాప్రసాద్
ABN, Publish Date - Jul 04 , 2024 | 01:35 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నామని, సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవ చూపటం శుభపరిణామమని టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నామని, సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవ చూపటం శుభపరిణామమని టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ (Durga Prasad) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan) వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) టీడీపీ (TDP) వైపు చూస్తున్నారని, పాత టీడీపీ నేతలు సొంత గూటికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు.
తెలంగాణలో బడుగు బలహీనవర్గాలకు తెలుగుదేశం అవసరం ఉందని, త్వరలో టీటీడీపీకి నూతన అధ్యక్షుడిని చంద్రబాబు నియమిస్తారని దుర్గాప్రసాద్ అన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కేసీఆర్ రాజకీయాలు చేశారని, పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు ఏడు మండలాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఆదివారం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలు, కార్యకర్తలను కలుస్తారన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కార్యాచరణ మెదలు పెడతామని చెప్పారు. శవాల మీద పేలాలు ఏరుకునేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవ్వకూడదని బీఆర్ఎస్ భావిస్తోందని, కేసీఆర్, జగన్ రాజకీయ బలహీనత వలనే తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని, ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి మిగలరని దుర్గాప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల (ఫోటో గ్యాలరీ)
ఆకాశమే హద్దుగా.. అమరావతి: సీఎం చంద్రబాబు
మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 04 , 2024 | 02:11 PM