BRS: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమీక్ష
ABN, Publish Date - Jan 21 , 2024 | 10:04 AM
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టనం ఈ మేరకు ఆహ్వానం పంపింది.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు ఆహ్వానం పంపింది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓటర్ల పరంగా మల్కాజిగిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మర్రి రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కే. కేశవరావు, మధుసూదనాచారి, చామకూర మల్లారెడ్డి, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు హాజరవుతున్నారు.
కాగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ టిక్కెట్ రేసులో మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మర్రి జనార్దన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఉన్నారు.
Updated Date - Jan 21 , 2024 | 10:29 AM