BRS vs Congress: బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:47 PM
వికారాబాద్ జిల్లా: పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి ఎండోమెంట్ అధికారులు తీసుకున్నారు. ఆలయం స్వాధీనంతో స్థానికంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయ రగడ నెలకొంది.
వికారాబాద్ జిల్లా: పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి ఎండోమెంట్ అధికారులు తీసుకున్నారు. ఆలయం స్వాధీనంతో స్థానికంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయ రగడ నెలకొంది. ఆలయానికి సంబంధించిన అన్ని వస్తువులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆలయ స్వాధీనాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆలయ ధర్మకర్తలకు... అభివృద్ధికి కృషిచేసిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై అధికారులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిపేరుతో స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ధర్మకర్త పేరు కనుమరుగు చేసేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకే గుడిని స్వాధీనం చేసుకున్నామని దేవదాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Updated Date - Feb 12 , 2024 | 03:47 PM