ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:41 PM

హైదరాబాద్: జీఓ నెం. 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. దీంతో బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా విద్యార్థి నేతలను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: జీఓ నెం. 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు (BRS student wing leaders,), కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ (Minister's Quarters) ముట్టడికి యత్నించారు. దీంతో బీఆర్ఎస్వీ (BRSV) విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) సహా విద్యార్థి నేతలను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలన్నారు. తెలంగాణ స్థానిక విద్యార్థులకు మెడికల్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.


ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రానరసింహ ప్లాన్ చేస్తున్నారని, జీవో నెంబర్ 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ స్థానికుడేనని, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రవేట్ మెడికల్ కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు చేసుకుంటున్నారని, కన్వీనర్ కోటలో వందల సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సిలింగ్ రెండవ దశకు చేరుకుందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.


తెలంగాణలో ఇంతవరకు మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీవో 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మినిస్టర్ క్వార్టర్స్ ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్న వేళ ఆందోళనలు చేయవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని పోలీసులు నచ్చచెప్పారు. అయినా విద్యార్థులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.


కాగా తెలంగాణలో ‘నీట్‌’ విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆగమాగం అవుతున్నారు. వైద్యారోగ్యశాఖకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. వారికి భరోసా కల్పిస్తూ కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని దుస్థితిలో హెల్త్‌ యూనివర్సిటీ, వైద్యారోగ్యశాఖలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యూపీలో భారీ వర్షాలు.. పరిస్థితి అతలాకుతలం..

అసమర్థ వ్యక్తి జగన్.. సీఎం ఎలా అయ్యారు?

క్షమాపణలు చెప్పించుకున్న కేంద్రమంత్రి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 15 , 2024 | 12:41 PM

Advertising
Advertising