ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: డిటర్జెంట్ పౌడర్ ముసుగులో స్మగ్లింగ్ గ్యాంగ్ ఏం చేసిందో తెలిస్తే..

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:13 AM

రాజేంద్రనగర్ ఎస్ఓటీ అధికారులు నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్‌కు కేటుగాళ్లు తెర లేపారు. గగన్ పహాడ్ వద్ద ఓ పార్కింగ్‌లో 2 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్‌కు చెందిన సిగరెట్లను గుర్తించారు.

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎస్ఓటీ అధికారులు నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్‌కు కేటుగాళ్లు తెర లేపారు. గగన్ పహాడ్ వద్ద ఓ పార్కింగ్‌లో 2 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్‌కు చెందిన సిగరెట్లను గుర్తించారు. బీహార్ రాష్ట్రం నుంచి పాట్నా మీదుగా హైదరాబాద్‌కు ఓ భారీ కంటైనర్‌లో సిగరెట్లను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) ముషీరాబాద్‌లోని శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ పేరు మీద డెలివరీ అడ్రస్ ఉంది. శ్రీరామ్ ఎంటర్‌ప్రైజెస్ చిరునామా ఆధారంగా పూర్తి వివరాలు స్వేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

Eid-al-Fitr: మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్‌..


బీహార్‌కు చెందిన‌ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‌మరొకరు పరారీలో ఉన్నారు. సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తున్న కంటైనర్‌కు కేటుగాళ్లు జీపీఆర్ఎస్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయం యజమానికి తప్ప.. మరెవ్వరికీ తెలియదు. ఎంత కాలం నుంచి ఈ దందా కొనసాగుతుందనే విషయాన్ని కూపి లాగుతున్నారు. ఎస్ఓటీ అధికారులు నకిలీ వస్తువులు తయారు చేస్తున్న కేటుగాళ్ల భరతం పట్టనున్నారు. శ్రీ రామ ఎంటర్‌ప్రైజెస్ యజమాని వివరాలను ఎస్ఓటీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నకిలీ సిగరెట్లు ఏ ఏ రాష్ట్రాలకు తరలించారనే పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.

Phone Tapping: రాధాకిషన్‌ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. వెలుగులోకి మరో దారుణం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 11 , 2024 | 08:44 AM

Advertising
Advertising