CM Revanth: ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN, Publish Date - Mar 02 , 2024 | 09:38 PM
ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర సచివాలయంలో శనివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర సచివాలయంలో శనివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు సీఎం రేవంత్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని... ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
Updated Date - Mar 02 , 2024 | 09:38 PM