ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించండి

ABN, Publish Date - Jan 05 , 2024 | 10:50 PM

హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలో ఉన్న భూములు కేటాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ( Rajnath Singh ) ను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కోరారు. కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం క‌లిశారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం అక్క‌డ ఉన్న ర‌క్ష‌ణ శాఖ భూమి 0.21 హెక్టార్ల‌ను బ‌దిలీ చేయాల‌ని కేంద్ర‌ మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

న్యూఢిల్లీ: హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలో ఉన్న భూములు కేటాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ( Rajnath Singh ) ను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కోరారు. కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం క‌లిశారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం అక్క‌డ ఉన్న ర‌క్ష‌ణ శాఖ భూమి 0.21 హెక్టార్ల‌ను బ‌దిలీ చేయాల‌ని కేంద్ర‌ మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. ఆ భాగంలో మిన‌హా స్కైవే నిర్మాణం పూర్తి కావ‌స్తున్నందున ఆ భూమిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని కోరారు. అందుకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండంను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూమి అవ‌స‌ర‌మ‌ని దానిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి విన్నవించారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్ల‌కోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్య‌త్తులో డ‌బుల్ డెక్క‌ర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రిని కోరారు. ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తుల‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సానుకూల స్పంద‌న వ్య‌క్తం చేశారు.స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తుల‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సానుకూల స్పంద‌న వ్య‌క్తం చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 10:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising