ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Assembly: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు

ABN, Publish Date - Feb 12 , 2024 | 01:41 PM

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య సోమవారం అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. నీటి ప్రాజెక్టులపై ఈరోజు సభలో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని...

హైదరాబాద్: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య సోమవారం అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. నీటి ప్రాజెక్టులపై ఈరోజు సభలో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఏద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యాలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్ళించడం అవుతుందన్నారు. కోడంగల్ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరి వచ్చారంటు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. 13వ తేదీ మంగళవారం రోజున ఛలో నల్లగొండకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆయకట్టు రైతులు, ప్రజలు భారీగా తరలి రావాలని కోరింది. అక్కడ నిర్వహించే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. అదే రోజు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. ఒకే రోజు అధికార, విపక్షాలు ప్రాజెక్టుల అంశంపై మాటల యుద్దానికి దిగుతున్నాయి.

Updated Date - Feb 12 , 2024 | 01:41 PM

Advertising
Advertising