CM Revanth: బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలతో సీఎం రేవంత్ సమీక్ష
ABN, Publish Date - Jan 27 , 2024 | 04:32 PM
Telangana: బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్‌ను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్, జనవరి 27: బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్‌ను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు.
అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలన్నారు. సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్డర్స్ వేశారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్‌గా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై పూర్తి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), సీతక్క (Seethakka), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbi Ali), సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 27 , 2024 | 04:32 PM