Congress: నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ
ABN, Publish Date - Mar 18 , 2024 | 08:19 AM
న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ అభ్యర్థులపై సోమవారం కాంగ్రెస్ ఫైనల్ కసరత్తు చేయనుంది. ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా 13 స్థానాల అభ్యర్థుల విషయంలో ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది.
న్యూఢిల్లీ: తెలంగాణ (Telangana) లోక్ సభ (Lok Sabha) అభ్యర్థులపై సోమవారం కాంగ్రెస్ (Congress) ఫైనల్ కసరత్తు (Final Exercise) చేయనుంది. ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం (Congress Central Election Committee meeting) కానుంది. ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా 13 స్థానాల అభ్యర్థుల విషయంలో ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. మిగిలిన13 స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించనుంది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండడంతో జాయినింగ్ విషయంలో గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. వారిలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకొని.. లోక్ సభ ఎన్నికలబరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తోంది.
కాంగ్రెస్‌లో చేరిన దానం , రంజిత్ రెడ్డి
రాష్ట్రంలో వేగంగా మారిపోతున్న రాజకీయాల్లో మరో కీలక పరిణామం..! ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు ఇంకో షాక్..! ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరికీ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాస్తవానికి చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. కానీ, ఆయన మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కొన్నాళ్లుగా కాంగ్రె్‌సతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు కొలిక్కిరావడంతో పార్టీ మారారు.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటివరకు ఎంపీలను మాత్రమే కోల్పోతున్న బీఆర్‌ఎస్‌కు.. కాంగ్రెస్‌లో చేరడం ద్వారా దానం నాగేందర్ ఝలక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన తొలి ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం. కాగా, దానంను సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది? అని కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై బలమైన అభ్యర్థిని నిలపాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకత్వం దానం పేరును తెరపైకి తెచ్చింది. దానం సాంకేతికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒక పార్టీ గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం సాధ్యమా? ఇలా చేస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలను ఎదుర్కొనాల్సి వస్తుందా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నిబంధన అడ్డు రాకుండా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, సికింద్రాబాద్‌లో పోటీకి దిగుతారా? అనే చర్చ నడుస్తోంది. మొత్తంమీద సికింద్రాబాద్‌లో దానంను పోటీ చేయించాలని మాత్రం కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Updated Date - Mar 18 , 2024 | 08:19 AM