TS News: డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు.. మినాక్సిటాప్ భారీగా లభ్యం
ABN, Publish Date - Mar 06 , 2024 | 12:19 PM
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండలో సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్స్‌లో తనిఖీ చేసి మినోక్సిటాప్ 10% అనే డ్రగ్‌ను అధికారులు సీజ్ చేశారు. కొత్త వెంట్రుకలు పెరగడానికి ఈ మందును అమ్ముతున్నారు, వినియోగదారులను తప్పుదారి పట్టించినందుకు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో డ్రగ్ కంట్రోల్ (Drug Control) అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండలో సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్స్‌లో తనిఖీ చేసి మినోక్సిటాప్ (Minoxy Top) 10% అనే డ్రగ్‌ను అధికారులు సీజ్ చేశారు. కొత్త వెంట్రుకలు పెరగడానికి ఈ మందును అమ్ముతున్నారు, వినియోగదారులను తప్పుదారి పట్టించినందుకు స్వాధీనం చేసుకున్నారు.
హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ( Healing Pharma India PVT) మినాక్సీటాప్ 10% తయారు చేస్తుంది. ఈ మెడిసిన్ వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఉపయోగపడుతుందని.. ఇది తిరిగి పెరగడాన్ని ప్రేరేపించడానికి వెంట్రుకల కుదుళ్లను తిరిగి సక్రియం చేస్తుందని ప్రచారం చేస్తూ మెడిసిన్ అమ్ముతున్నారు. డీసీఏ అధికారులు దాడుల్లో మినాక్సీటాప్ 10% నిల్వలు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి.
CM Revanth Reddy: రేపే కాంగ్రెస్ తొలి జాబితా.. ఎంపిక బాధ్యత రేవంత్‌దే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2024 | 12:19 PM