ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drugs Case: నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.

ABN, Publish Date - Jan 30 , 2024 | 01:18 PM

టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.

హైదరాబాద్: టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే.. అధికారులు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే.. నార్సింగిలో ఇద్దరు నిందితులను తాజాగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు లావణ్య అనే విద్యార్థిని కాగా, మరొకరు ఉనీత్ రెడ్డి. సదరు యువతి లావణ్య.. ఒక హీరో ప్రియురాలు అని తేలింది.

రిమాండ్ రిపోర్టులోని అంశాల ఆధారంగా.. విజయవాడ నుంచి ఉన్నత చదువులు కోసం లావణ్య హైదరాబాద్‌కు వచ్చింది. జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్‌లో ఛాన్స్ కోసం లావణ్య ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తూ చిన్న సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా లావణ్య నటించింది. కొన్ని షార్ట్ ఫిలింస్‌లో హీరోయిన్‌గా సైతం నటించింది. ఆ సమయంలోనే ఆమె జల్సాలకు అలవాటు పడింది. ఒక హీరోతో లవ్ అఫైర్ కూడా నడుపుతోంది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య .. గత కొంత కాలంగా ఉనిత్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్‌ని సైతం పోలీసులు పరిశీలించనున్నారు. చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 02:01 PM

Advertising
Advertising