EC Notices: కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు
ABN, Publish Date - Apr 17 , 2024 | 11:32 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలలపై నోటిసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex CM KCR)కు ఎన్నికల కమిషన్ నోటీసులు (EC Notices) జారీ చేసింది. ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలలపై నోటిసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది. గురువారం (18వ తేదీ) లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గురువారం ఉదయం 11 గంటలలోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఈసీ నోటీసులు ఇచ్చింది.
సిరిసిల్ల సభ (Sirisilla Sabha)లో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేసీఆర్, కేటీఆర్ (KTR)కు కూడా నోటీసులు జారీ చేసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళుతుండడంతో ఈసీ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రేపటి నుండి నామినేషన్లు
గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడానికి ఏప్రిల్ 25 వరకు అవకాశముంది. మే 13న పోలింగ్... జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి పోలీసులు దాదాపు రూ. వంద కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బీఆరెస్ పార్టీలు ప్రకటించాయి. అధికారి పార్టీ కాంగ్రెస్ 14 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇదికూడా చదవండి:
కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..
కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..
Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..
Updated Date - Apr 17 , 2024 | 11:34 AM