TS News: యధావిధిగా ఎర్రగడ్డ రైతు మార్కెట్ విక్రయాలు
ABN , Publish Date - Jan 03 , 2024 | 10:33 AM
Telangana: నగరంలోని ఎర్రగడ్డ రైతు మార్కెట్ విక్రయాలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని విక్రయాదారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రావలసిన హెవీ వెహికల్స్ కాస్త ఆలస్యంగా వచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్, జనవరి 3: నగరంలోని ఎర్రగడ్డ రైతు మార్కెట్ విక్రయాలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని విక్రయాదారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రావలసిన హెవీ వెహికల్స్ కాస్త ఆలస్యంగా వచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలతో రావాల్సిన వాహనాలు రాకపోవడంతో ధరలపై కాస్త ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్కుడ్రైవర్లు సోమవారం సమ్మెకు దిగారు. మంగళవారం ఆ సమ్మె రెండోరోజుకు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో వాహనదారులు తమ వెహికిల్స్‌తో పెట్రోల్ బంక్‌లకు క్యూకట్టారు. దీంతో వేలాదిగా వాహనదారులు రావడంతో పెట్రోల్ బంక్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో చాలాచోట్ల.. నోస్టాక్ బోర్డులు పెట్టినా కదలడానికి వాహనదారులు ససేమిరా అనడంతో పోలీసులు జోక్యం చేసుకుని, వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించాల్సి వచ్చింది. అయితే మధ్యాహ్నానానికి ట్యాంకర్ డ్రైవర్లు తాత్కాలికంగా సమ్మెను విరమించారు. ట్యాంకర్ డ్రైవర్లు ప్రకటన వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లైంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వాహనాలు కాస్త ఆలస్యంగా అయినా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...