ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime: ప్రణీత్‌రావుపై ఎఫ్‌ఐఆర్‌.. ఫోన్లను ట్యాపింగ్ వ్యవహారం..

ABN, Publish Date - Mar 11 , 2024 | 09:48 AM

గత ప్రభుత్వ హయాంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్‌ఐబీ)లో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజున.. అంటే.. గత ఏడాది డిసెంబరు 4న ప్రణీత్‌రావు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశాడంటూ..

ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద కేసు

నాన్‌–బెయిలబుల్‌ సెక్షన్ల ప్రయోగం

డిసెంబరు 4న ఎస్‌ఐబీలో

ఎస్‌ఐబీలో హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్ల కాల్చివేతపై అదనపు ఎస్పీ రమేశ్‌ ఫిర్యాదు

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు

పంజాగుట్ట/హైదరాబాద్‌ సిటీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్‌ఐబీ)లో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజున.. అంటే.. గత ఏడాది డిసెంబరు 4న ప్రణీత్‌రావు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశాడంటూ ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్‌ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు ప్రణీత్‌రావుపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 409, 427, 201, 120(బి) సెక్షన్లు, ప్రివెన్షన్‌ ఆఫ్‌ డామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్‌ 3, సమాచార సాంకేతిక(ఐటీ) చట్టంలోని సెక్షన్లు 65, 66, 70 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రణీత్‌రావు 2018 నుంచి ఎస్‌ఐబీలో పనిచేస్తున్నారు. తొలుత ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ప్రణీత్‌రావుకు గత ఏడాది యాగ్జిలరీ పదోన్నతి లభించింది. దాంతో డీఎస్పీ అయ్యారు. ‘‘ఎస్‌ఐబీలోని ఇతర బృందాలతో సంబంధం లేకుండా.. తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో 17 కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల సమాచారాన్ని రహస్యం గా, అనధికారికంగా, చట్టవిరుద్ధంగా సేకరించేవా రు. ఆ కార్యకలాపాలన్నీ ప్రణీత్‌రావు స్వయంగా పర్యవేక్షించేవారు’’ అని అదనపు ఎస్పీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాతి రోజున ప్రణీత్‌రావు తన కార్యాలయంలోని సీసీ కెమెరాలను ఎలక్ట్రీషియన్‌తో ఆఫ్‌ చేయించారు. 17 కంప్యూటర్లలో ఉన్న డేటాను, సమాచారాన్ని, హార్డ్‌డిస్క్‌లతో సహా కాల్చివేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. కొత్త హార్డ్‌డిస్క్‌లను ఏర్పాటు చేశారు. తన పదవిని దుర్వినియోగం చేస్తూ.. ఇతరులతో కలిసి, ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నారని అదనపు ఎస్పీ రమేశ్‌ పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు వివరించారు.

నేడో రేపో అరెస్టు?

ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు ఒకట్రెండ్రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే డీజీపీ రవిగుప్తా ఆయనను సస్పెండ్‌ చేశారు. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లకూడదంటూ సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక ప్రణీత్‌రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాన్‌–బెయిలబుల్‌ కేటగిరీలో ఉన్నాయి. అంటే.. ప్రణీత్‌రావు ముందస్తు బెయిల్‌ తీసుకునేందుకు వీల్లేదు. అరెస్టయ్యాక కూడా.. బెయిల్‌ వచ్చే అవకాశాలు తక్కువే. తీవ్రమైన కేసు కావడంతో ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించే అవకాశాలున్నాయి. లేనిపక్షంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)ను ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రణీత్‌రావు అరెస్టయ్యాక.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.

Updated Date - Mar 11 , 2024 | 09:48 AM

Advertising
Advertising