ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Food Safety: తగ్గేదేలే అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. నాన్‌స్టాప్‌గా మెరుపుదాడులు

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:01 PM

Telangana: గ్రేటర్‌లో ఫుడ్‌‌సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో హోటళ్లలో, రెస్టారెంట్లలో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ, ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

Food safety officials raid in Hyderabad Telangana

హైదరాబాద్, నవంబర్ 21: గ్రేటర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. ఆహారం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటళ్లపై వరుసగా దాడులు చేస్తున్నారు. ఆహార నాణ్యత విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ, ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దారుణమైన విషయాలు బయటపడుతున్న పరిస్థితి. చికెన్, మటన్, ఫిష్‌తో పాటు పన్నీర్ చెడిపోకుండా కెమికల్స్ కలుపుతున్నట్లు గుర్తించారు.

CP Anand: నేను కూడా రాజీనామా చేసి వెళ్ళాలనుకున్నా


రెస్టారెంట్ల నిర్వాహకులు.. ఫార్మలిన్ కలిపిన చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. వంటకాల్లో సింథటిక్ కలర్లు కలిపిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పొట్టుతో పాటు కుళ్లిన అరటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. బట్టల రంగుల్లో వాడే ప్రమాదకరమైన కాస్టిక్ సోడాను కూడా ఫుడ్ కలర్స్‌గా వినియోగిస్తున్నట్లుగా తనిఖీల్లో బయటపడింది. సిటీలో 64% హోటల్స్ , రెస్టారెంట్స్ కల్తీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు అధికారులు. హోటల్స్‌తో పాటు మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నజర్ పెట్టారు.


రాజేంద్రనగర్ కాటేదాన్‌లో పలు కార్ఖానలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం, వెల్లుల్లి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సింథటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వచేసిన 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. దాడుల్లో భాగంగా 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.


కాగా.. . భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీ‌పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో ఫుడ్ క్వాలిటీ‌లో హైదరాబాద్ చివరిగా నిలిచిన విషయం తెలిసిందే. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి. . 62% హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.


ఇవి కూడా చదవండి...

పీఏసీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ

షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 12:04 PM