ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వీడిన మియాపూర్ యువతి మర్డర్ కేసు..

ABN, Publish Date - Aug 12 , 2024 | 09:00 PM

మియాపూర్‌లో యువతి గీతాంజలి ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తోటి ఉద్యోగులు అని తేల్చారు. నలుగురి సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. రిమాండ్‌కు పంపించామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గీతాంజలి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తొలుత అంతా సూసైడ్ అనుకున్నారు. ఆమె తల్లి సందేహాం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

miyapur women

హైదరాబాద్: మియాపూర్‌లో యువతి (miyapur women) గీతాంజలి ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తోటి ఉద్యోగులు అని తేల్చారు. నలుగురి సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. రిమాండ్‌కు పంపించామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గీతాంజలి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తొలుత అంతా సూసైడ్ అనుకున్నారు. ఆమె తల్లి సందేహాం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


గీతాంజలి స్వస్థలం ఒడిశా.. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. మియాపూర్ మయూరి నగర్‌లో గల కోరుకొండ కోచింగ్ సెంటర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేది. ఆమెతో మిగతా సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. ఈ నెల 5వ తేదీ నుంచి కోచింగ్ సెంటర్‌కు సెలవులు ఇచ్చారు. 8వ తేదీ గురువారం తిరిగి కోచింగ్ సెంటర్ ప్రారంభమైంది. ఆ రోజు గీతాంజలి డ్యూటీకి వెళ్లింది. అక్కడ సెక్యూరిటీ గార్డులు వేధించడంతో మనో వేదనకు గురయ్యింది. తోటి ఉద్యోగులు తనను అవమానిస్తారా అని తట్టుకోలేక పోయింది. ఆ రోజు రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబానికి తీరని కడుపుకోత మిగిల్చింది. గీతాంజల్లి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. తోటి సెక్యూరిటీ గార్డ్స్ వేధించారని విచారణలో తేలింది. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 12 , 2024 | 09:00 PM

Advertising
Advertising
<