ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metro: రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ప్రభుత్వ శ్రీకారం

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:29 PM

ఏడేళ్లు మెట్రో విస్తరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. రెండు, మూడో దశ నిర్మాణాలు కూడా దేశంలోని ఇతర నగరాలు పూర్తిచేసాయన్నారు. దీంతో మెట్రో సేవల్లో హైదరాబాద్ 2వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. హైదరాబాదును ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ నగరాలు అధిగమించాయి.

హైదరాబాద్: మెట్రో రైల్ (Metro Rail) రెండవ దశ (Second Phase) ప్రాజెక్టుకు లైన్ క్లియర్ (Line Clear) అయింది. మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం (State Govt.,) నిర్ణయించింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌ (DPR)కు రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలిపింది. రూ. 24,269 కోట్ల అంచనాలతో మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే మెట్రో రెండో దశ పనులు మొదలు పెడుతుంది. రాబోయే నాలుగు ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్‌గా ప్రభుత్వం పెట్టుకుంది. మెట్రో రైల్ హైదరాబాద్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లలో సేవలందిస్తోంది. మొదటి దశ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో రూ. 22,000 కోట్లతో పూర్తి. అయింది. ప్రస్తుతం మెట్రోలో రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంది. మెట్రో రైల్ మొదటి దశ అమలుతో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.

ఏడేళ్లు మెట్రో విస్తరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. రెండు, మూడో దశ నిర్మాణాలు కూడా దేశంలోని ఇతర నగరాలు పూర్తి చేశాయన్నారు. దీంతో మెట్రో సేవల్లో హైదరాబాద్ 2వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. హైదరాబాదును ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ నగరాలు అధిగమించాయి. కాగా మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కార్. మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. రెండవ దశలో అయిదు కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేర మెట్రో విస్తరణకు డీపీఆర్ (DPR) సిద్దం చేసింది. దీంతో మెట్రో రెండో దశ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


రెండో దశలో ప్రభుత్వం ఐదు కొత్త కారిడార్‌లు ప్రతిపాదించింది. నాలుగో కారిడార్ నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ).. ఐదో కారిడార్ రాయదుర్గ్ టూ కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ), ఆరో కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ), ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు (13.4 కి.మీ), ఎనిమిదో కారిడార్ ఎల్‌బీనగర్ టూ హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.). కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో మెట్రో రెండవ దశ పనులకు ప్లాన్ చేస్తోంది. రెండో దశ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 24.269 కోట్లు. అందులో 30 శాతం అంటే రూ.7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం..18 శాతం అంటే రూ. 4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ఆనందం కోసమే షర్మిల పోరాటం..

కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ..

టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి: మంత్రి పొన్నం

స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్

7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 27 , 2024 | 01:29 PM