ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Governor Tamilisai: ఓటర్లను ఫోర్స్ చేయొద్దు.. పాడికౌశిక్ రెడ్డిపై గవర్నర్ తమిళిసై సీరియస్

ABN, Publish Date - Jan 25 , 2024 | 11:25 AM

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సీరియస్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఉద్దేశించి పాడికౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓటర్స్ డే సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ఓటు వెయ్యకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ కామెంట్స్‌పై మండిపడ్డ గవర్నర్.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.

హైదరాబాద్, జనవరి 25: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై (BRS MLA Padi Kaushikreddy) రాష్ట్ర గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) సీరియస్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఉద్దేశించి పాడికౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓటర్స్ డే సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ఓటు వెయ్యకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ కామెంట్స్‌పై మండిపడ్డ గవర్నర్.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.

నేషనల్ ఓటర్స్‌డే సందర్బంగా జేఎన్‌టీయూలో నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ... ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారని.. ఎలక్షన్ కమిషన్ అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దన్నారు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఓట్ మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధమని.. డెమొక్రసీ బతకాలి అంటే ఓటు వేయాలని స్పష్టం చేశారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని... ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని గవర్నర్ కోరారు.


నేను నోటాకు వ్యతిరేకం....

ఓటు వేయడం అందరి హక్కు అని గవర్నర్ అన్నారు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. సాధారణ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి హోం ఓటింగ్ మంచి పరిణామమన్నారు. ఓటింగ్ రోజు సెలవు సరదా కోసం కాదని యువత గుర్తించుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్లు అనుకోవాలని.. ఓటర్ మార్క్ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలన్నారు. బ్యాడ్ అఫిషియల్ ఎలెక్టెడ్ బై గుడ్ ఓటర్ అని అన్నారు. ‘‘నేను నోటా ఓటుకు వ్యతిరేకం’’ అని స్పష్టం చేశారు. బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 25 , 2024 | 12:27 PM

Advertising
Advertising