Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Oct 10 , 2024 | 06:27 PM
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారింది. ఓ వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుండగా.. వేడితో అల్లాడుతున్న హైదరాబాద్‌వాసులకు వాన జల్లులు పలకరించాయి.
హైదరాబాద్: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారింది. ఓ వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుండగా.. వేడితో అల్లాడుతున్న హైదరాబాద్‌వాసులకు వాన జల్లులు పలకరించాయి. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వర్షం కురవడం ఉపశమనాన్నిచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, సరూర్ నగర్, కొత్త పేట, మలక్‌పేట పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తోంది.
నగరానికి పడమరనున్న జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, కీసర, ఘట్ కేసర్, అబ్దుల్లాపూర్ మెట్, నాంపల్లి, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. సద్దుల బతుకమ్మ వేడుకలు ఓ వైపున, వర్షం కూడా కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. ఇవాళ రాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Ratan Tata: మొబైల్ కూడా వాడని రతన్ టాటా సోదరుడు.. ఈయన మీకు తెలుసా
Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..
Ratan Tata: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?
Ratan Tata: రతన్ టాటా లేరన్న వార్తను నమ్మలేకపోతున్నా: ఆనంద్ మహీంద్రా
Updated Date - Oct 10 , 2024 | 06:28 PM