ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైదరాబాదీలకు హై అలర్ట్.. ఈ ఏరియాల్లో టీవీ, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

ABN, Publish Date - Aug 06 , 2024 | 03:23 PM

హైదరాబాద్‌లో పిచ్చి మొక్కలు తొలగిస్తూ.. వైర్ల కింద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తీసేస్తున్నారు. తాజాగా నగరవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజవకవర్గాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.

హైదరాబాద్: అసలే వర్షాకాలం.. దానికితోడు గజిబిజిగా ఉండే కేబుల్, విద్యుత్ వైర్లు. తెగిపడి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలు. వీటిని ఆపడానికి జీహెచ్ఎంసీ ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. తాజాగా మరోమారు సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్‌వ్యాప్తంగా కార్యాచరణ ముమ్మరం చేసింది. వైర్లకు అడ్డుగా ఉన్న చెట్లను జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది తొలగిస్తున్నారు.

పిచ్చి మొక్కలు తొలగిస్తూ.. వైర్ల కింద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తీసేస్తున్నారు. తాజాగా నగరవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజవకవర్గాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్స్‌ని సిబ్బంది తొలగిస్తుండటంతో వివిధ ప్రసార సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. సహకరించాలని హైదరాబాద్ వాసులను కోరారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన కేబుల్స్ తొలగిస్తూ ముందుకుసాగుతున్నారు. అంతకంటే ముందే కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్‌లతో విద్యుత్ అధికారులు సమావేశమయ్యారు.


51 శాతం నిరుపయోగం..

హైదరాబాద్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై 51 శాతం టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. అనుమతి లేకుండా కేబుల్స్ వేస్తుండటంతో విద్యుత్ స్తంభాలు వంగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆ నోటీసులను వారు పట్టించుకోకపోవడంతో సమావేశం ఏర్పాటు చేసి.. కేబుళ్లను తొలగిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా ఉన్న కేబుల్స్ ను మాత్రమే తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. బరువు ఎక్కువైతే కరెంటు వైర్లు తెగిపడే ప్రమాదం ఉందని.. అందుకే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

Updated Date - Aug 06 , 2024 | 03:30 PM

Advertising
Advertising
<