Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరాకు అంతరాయం..
ABN, Publish Date - Mar 07 , 2024 | 09:11 PM
Hyderabad News: నగర వాసులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(HMWSSB). నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు(Water Supply) అంతరాయం ఏర్పడుంది. ఈ మేరకు అలర్ట్ ప్రకటించింది. నీటి సరఫరా లైన్ నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో మార్చి 10, 2024 తేదీన ఉదయం 6 గంటల నుంచి..
హైదరాబాద్, మార్చి 07: నగర వాసులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(HMWSSB). నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు(Water Supply) అంతరాయం ఏర్పడుంది. ఈ మేరకు అలర్ట్ ప్రకటించింది. నీటి సరఫరా లైన్ నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో మార్చి 10, 2024 తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..
విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, బజార్‌ఘాట్, ఏసీ గార్డ్స్, రెడ్‌హిల్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఏరియా, సచివాలయ పరిసర ప్రాంతాలు, ఇందిరానగర్, బీజేఆర్ కాలనీ, అడ్వకేట్ కాలనీ, హిల్ కాలనీల్లో తాగునీటి సరఫరా ఉండదు.
మరికొన్ని ప్రాంతాల్లో కూడా..
గోకుల్ నగర్, నాంపల్లి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, జంగం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకపూల్, సీతారాం బాగ్, గన్‌ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్‌కే భవన్, హిందీ నగర్, ఘోడే-ఖబర్, దోమల్‌గూడ, గాంధీనగర్, ఎమ్మెల్యే కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానా, NBT నగర్, నూర్‌నగర్‌లోని కొన్ని ఏరియాల్లో నీటి సరఫరాకు అంతరాయం కులగనుంది.
పొదుపు అవసరం..
మార్చి 10వ తేదీన తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్న నేపథ్యంలో ప్రజలు కాస్త పొదుపుగా నీటిని వినియోగించాలని సూచించారు అధికారులు. నీటిని ముందే పట్టి పెట్టుకోవడంతో పాటు.. పొదుగా వినియోగించాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 07 , 2024 | 09:11 PM