ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..!

ABN, Publish Date - Jan 09 , 2024 | 08:24 PM

సంక్రాంతి పండుగ వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఉపాది కోసం పల్లె సీమల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి కోసం తమ తమ గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు.

Sankranti 2024

హైదరాబాద్, జనవరి 09: సంక్రాంతి పండుగ వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఉపాది కోసం పల్లె సీమల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి కోసం తమ తమ గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు. అయితే, పండుగ సంబరంలో పడి.. ఇంటిని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు నగర పోలీసులు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆయా జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. కొందరికి సొంతిళ్లు ఉంటే.. మరికొందరు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతికి నగరం నుంచి వేలాది మంది ప్రజలు తమ తమ స్వగ్రామాలకు తరలి వెళ్తుంటారు. పండుగ కోసం ఇలా గ్రామాలకు వెళ్లే వారికి హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. నగరంలో దొంగల బెడద ఎక్కువైంది. దీంతో ఊళ్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సంక్రాంతి వేళ గ్రామాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ మేరకు అవగాహన పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్లేవారు.. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను సేఫ్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే.. తమ వెంట తీసుకెళ్లడం గానీ.. లేదంటే బ్యాంక్ లాకర్‌లో పెట్టడం గానీ చేయాలన్నారు. ఊళ్లకు వెళ్లే వారు ఈ విషయాన్ని తమ పొరుగువారికి చెప్పాలన్నారు. వీలైతే.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందిస్తే.. అక్కడ నిఘా పెంచుతారని పోలీసులు తెలిపారు. అదే విధంగా కాలనీల్లో ఎవరైనా అపరిత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే.. పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ కోసం హ్యాపీగా వెళ్లి.. హ్యాపీగా రావాలని పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 08:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising