ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: వాళ్లందరికీ హైడ్రా గుడ్ న్యూస్.. ఆక్రమణలు తొలగించబోమని ప్రకటన..

ABN, Publish Date - Sep 08 , 2024 | 04:00 PM

ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటన చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని..

AV Rangnath

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఆగడం లేదు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసిన నిర్మించిన కట్టడాలను కూలుస్తూ.. ఆక్రమణదారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎటువంటి అనుమతలు తీసుకోకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బడా బాబులను హైడ్రా వదలడం లేదు. ఇదే సమయంలో సామాన్యుల ఇళ్లను హైడ్రా కూలుస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం పేద, మధ్య తరగతి ప్రజల నిర్మాణాలను తాము కూల్చడం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల పేద, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూలుస్తున్నారంటూ వార్తలు వస్తుండటంతో హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటన చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణంలో ఉన్న కట్టడాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Murali Mohan: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్..


సామాన్యుల నివాసాలపై క్లారిటీ..

ఎఫ్‌టిల్, బఫర్ జోన్‌లోని ఆక్రమిత స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న సామాన్య వ్యక్తుల ఇళ్లను కూల్చివేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుందని తెలిపారు. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట్ చెరువులో ఆదివారం కూల్చివేసిన కట్టడాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఎటువంటి అనుమతలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి కాంపౌండ్ గోడలు, కొన్ని గదులు, షెడ్‌లు ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఈ నిర్మాణాలు వైసీపీ నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందినవిగా తెలిపారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు, హోటల్స్‌ను వాణిజ్యపరంగా వినియోగిస్తుండటంతో కూల్చివేశామని చెప్పారు.

Minister Pongulet: విపత్కర సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం


హైదరాబాద్ ప్రజలకు హైడ్రా హామీ..

ఆక్రమిత స్థలాల్లో ఉంటున్న సామాన్య వ్యక్తులకు సంబంధించి ఇళ్లు, నివాసాలు కూల్చివేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మల్లంపేట చెరువు, దుండిగల్‌లో కూల్చిన 7 విల్లాలు ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాలను ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ భవన నిర్మాణాలతో స్థానికంగా లేడీ డాన్‌గా పిలిచే బిల్డర్ విజయలక్ష్మి, స్థానిక రాజకీయ నేతలకు సంబంధం ఉందన్నారు. బిల్డర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో అనేకమంది ఫిర్యాదులు చేయడంతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న సున్నం చెరువులో కొందరు నిర్మాణాలు చేసి అద్దెకు ఇస్తున్నారని, అలాంటివారిపై కేసులు పెడుతున్నామన్నారు. నిర్మాణాలు పూర్తై ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం లేదని చెప్పారు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఇల్లు, ఫ్లాట్, భూమిని కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతున్నామని రంగనాథ్ తెలిపారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఆస్తులు కొనే విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే హెచ్ఎండిఎ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మరిన్ని సందేహాలు ఉంటే తమను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని హైడ్రా కమిషనర్ తెలిపారు.


Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఊహించని విరాళం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 08 , 2024 | 04:00 PM

Advertising
Advertising