HYDRA: బతుకమ్మకుంటపై హైడ్రా కమిషనర్ సంచలన కామెంట్స్
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:06 PM
Telangana: హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని రంగనాథ్ అన్నారు. హైడ్రా నోటీసులు అక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయని వెల్లడించారు. ఈరోజు ఉదయం అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బతుకమ్మకుంటపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 13: నగరంలోని బతుకమ్మకుంటపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. బుధవారం అంబర్ పేట్ బతుకమ్మకుంట చేరుకున్న హైడ్రా కమిషనర్.. ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు. కేవలం బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని.. ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చినట్లు చెప్పారు.
AP Highcourt: సోషల్ మీడియాలో పోస్టులపై పిల్.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ప్రస్తుతం ఉన్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందన్నారు. హైడ్రా నోటీసులు అక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయని వెల్లడించారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను ఈరోజు కూల్చేశామని తెలిపారు. ఐదు కాలనీలకు వెళ్ళే రోడ్డును ఆక్రమించారన్నారు. తమకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు బతుకమ్మకుంటను పరిశీలించారు.
Bulldozer Justice: బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు సీరియస్.. ఏమన్నదంటే..
హైటెన్షన్..
అయితే బతుకమ్మకుంట వద్ద హైడ్రా కమిషనర్ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మకుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు బతుకమ్మకుంటను పరిశీలించాలని రంగనాథ్ నిర్ణయించారు. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే తమ ఇళ్లను కూల్చవద్దంటూ స్థానికులు నిరసనకు దిగారు. ఇళ్లను తొలగించకుండా చెరువు సుందరీ కరణ పనులు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. చివరకు బతుకమ్మకుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్.. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇండ్లను కూల్చబోమని.. కేవలం బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామని చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
మళ్లీ కూల్చివేతలు
మరోవైపు నగరంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. ఈరోజు నాగారంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్‌నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేసింది. రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.
ఇవి కూడా చదవండి...
BRS: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ కీలక నేతలు ఏమన్నారంటే
Read Latest Telangana News ANd Telugu News
Updated Date - Nov 13 , 2024 | 01:22 PM