Tomato: పెరిగిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే..
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:52 AM
హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టమాటా కేజీ రూ.100కు చేరింది. అయితే ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో అయితే కేజీ టమాటా ఒక మాదిరిగా ఉన్న టమాటాలు కేజీ రూ. 40, 50లకు లభించగా.. పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ. 60కు లభించాయి.
హైదరాబాద్: టమాటా (Tomato) ధరలు (Prices) మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టమాటా కేజీ రూ.100కు చేరింది. అయితే ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో అయితే కేజీ టమాటా ఒక మాదిరిగా ఉన్న టమాటాలు కేజీ రూ. 40, 50లకు లభించగా.. పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ. 60కు లభించాయి. ఇప్పుడు మరోసారి టమాటా ధరలు పెరిగాయి. ఇప్పుడు గ్రేడ్-ఏ టమాటాలు కేజీ రూ.100కు చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాగా నిన్న, మొన్నటి వరకు ధరలు లేక డీలా పడిన టమోటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఉత్పత్తి తగ్గటంతో రేట్లు అమాంతం పైకి చేరాయి. అలాగే ఉల్లిపాయల ధర కూడా పెరిగిపోయింది. వంద రూపాయలకు 4 కేజీలు వస్తుండగా ప్రస్తుతం రెండు కేజీలు వస్తున్నాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలతో సమతమతమవుతున్నారు. తక్కువ ధరకు లభించే ఆలుగడ్డ కిలో రూ.50 కి చేరింది. కిలో వంకాయ రూ.80 కి చేరింది. పచ్చి మిర్చి కిలో రూ.100కు చేరింది. ఒక్క కూరగాయల ధరలు మాత్రమే కాదు నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రుణమాఫీ రూపొందించిన విధానం సరిగాలేదు
డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆ నేతల ఆశలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 17 , 2024 | 01:01 PM