ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GHMC Budget: జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ విజయలక్ష్మి.. వార్షిక బడ్జెట్ ఎన్ని కోట్లంటే..

ABN, Publish Date - Feb 20 , 2024 | 05:37 PM

ఆర్థిక సంవత్సరం 2024 -25కి సంబంధించిన బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. రూ.8,437 కోట్ల వార్షిక బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఆమె సమర్పించారు. సాధారణ బడ్జెట్ రూ.7937 కోట్లు కాగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ఆమె వివరించారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో బడ్జెట్‌పై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ బడ్జెట్ లెక్కలో స్పష్టత కనిపించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ విమర్శించారు.

హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం 2024 -25కి సంబంధించిన బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. రూ.8,437 కోట్ల వార్షిక బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఆమె సమర్పించారు. సాధారణ బడ్జెట్ రూ.7937 కోట్లు కాగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ఆమె వివరించారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో బడ్జెట్‌పై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ బడ్జెట్ లెక్కలో స్పష్టత కనిపించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ విమర్శించారు. ‘‘ రూ.3,646 కోట్లు ఆదాయం చూపిస్తున్నారు. ఇందులో అన్ని ఖర్చులు కలిపి రూ.3,500 కోట్లు అవుతుంది. అన్ని ఖర్చులు పోగా మిగిలిన రూ.450 కోట్ల నిధులతో మాత్రమే జీహెచ్ఎంసీ నడుస్తుందా?’’ అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, రూ.3 వేల కోట్లు జీహెచ్ఎంసీకి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ ఉన్నా రూ.1100 కోట్లు మాత్రమే తక్కువ పెట్టారు. జీహెచ్ఎంసీలో అదనపు ఖర్చుల కోసం ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ రూ.128 కోట్లు మాత్రమే లోన్స్ రూపంతో తెచ్చే పరిస్థితి ఉందని లెక్కలు చెప్తున్నాయని మ్మెల్యే మాజీద్ హుస్సేన్ ప్రస్తావించారు. ‘‘జీహెచ్ఎంసీ బడ్జెట్ పుస్తకం అనేది లెక్కల కోసం మాత్రమేనా?. రూ.6 వేల కోట్ల లోన్ బకాయిలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి?. అప్పులు, లోన్స్ చూశాక జీహెచ్ఎంసీ పటిష్ఠంగా ఉందని ఎలా నమ్మాలి. ఆయా డివిజన్లకు 11వందల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది’’ అని మ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్నారు.

నిర్ల్యక్షపు అధికారులపై చర్యలకు సిద్ధం

నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. వివరాలు సేకరించాలని మేయర్ విజయలక్ష్మి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువకాలం పనిచేస్తున్న, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారి లెక్కలు తయారు చేయాలని మేయర్ ఆదేశించారు. లిస్ట్ రెడీ అయ్యాక ప్రభుత్వానికి అందించాలని లేదా ఇతర శాఖలకు పంపాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీలో పని చేస్తున్న 45 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. కార్పొరేటర్లకు, ప్రజాసమస్యలపై రెస్పాన్స్ అవ్వని ఆఫీసర్స్‌ను బదిలీ చేస్తూ ఈ తీర్మానం చేసింది.

Updated Date - Feb 20 , 2024 | 05:37 PM

Advertising
Advertising