ABN Effect: కొండలు తవ్వి విల్లాలకు రోడ్ల నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
ABN, Publish Date - Jan 17 , 2024 | 10:25 AM
Telangana: నగరంలోని ఖాజాగూడా బయోడైవర్సిటీ పార్కు పెద్ద చెరువు పక్కన ప్రభుత్వ భూముల్లో కొండలను తవ్వి విల్లాలకు రోడ్లు నిర్మిస్తున్న ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
హైదరాబాద్, జనవరి 17: నగరంలోని ఖాజాగూడా బయోడైవర్సిటీ పార్కు పెద్ద చెరువు పక్కన ప్రభుత్వ భూముల్లో కొండలను తవ్వి విల్లాలకు రోడ్లు నిర్మిస్తున్న ఘటనపై ప్రభుత్వం (Telangana Government) సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో (ABN - Andhrajyothy) వచ్చిన కథనంపై రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే రోడ్ల నిర్మాణం పనులు ఆపించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, రంగారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో కీలక మంత్రి బామ్మర్దికి విల్లా ప్రాజెక్టుతో సంబంధాలు ఉన్నాయని.. అదే విల్లాలో మాజీ మంత్రి ఉంటున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 17 , 2024 | 03:00 PM