Komatireddy: హామీల అమలులో జాప్యం ఎందుకో చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
ABN, Publish Date - Jan 23 , 2024 | 03:48 PM
Telangana: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... హమీల అమలుపై ఈరోజు రివ్యు చేశామని.. వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 23: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... హమీల అమలుపై ఈరోజు రివ్యూ చేశామని.. వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేరవేరబోతుందన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని విమర్శించారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకుని డబుల్ బెడ్ రూంల వరకు అన్ని హమీలను బీఆర్‌ఎస్ విస్మరించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 23 , 2024 | 03:48 PM