ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:51 PM

తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50 శాతానికి కేంద్రం పెంచాలని అడిగారు. ప్రజా భవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం ఈరోజు(మంగళవారం) జరిగింది. చైర్మన్, సభ్యులతో కూడిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందజేయాలని ఆర్థిక మంత్రి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) కోరారు. పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటాను 41 శాతానికి నుంచి 50 శాతానికి కేంద్రం పెంచాలని అడిగారు. ప్రజా భవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం ఈరోజు(మంగళవారం) జరిగింది. చైర్మన్, సభ్యులతో కూడిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివని మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.


ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని వివరించారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ రాష్ట్రాలకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని అన్నారు. ఫలితంగా కేంద్ర ప్రయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం అందించాలని మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ కీలక దశలో ఉందని.. ఆర్థికంగా, వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 6.85 లక్షల కోట్లకు పైగా రుణభాఠంతో రాష్ట్రం సతమతం అవుతోందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.


ALSO READ:CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ యంగెస్ట్.. ది ఫ్యూచర్ స్టేట్

సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని చెప్పారు. సంక్షేమ పథకాలను బలోపేతం చేయడం కోసం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందని చెప్పారు. ఇది తెలంగాణ డిమాండ్ కాదని.. అన్ని రాష్ట్రాలకు సంబంధించినదని మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు.


ALSO READ:Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారిత్రక కారణాలవల్ల అసమాన అభివృద్ధి ఇ క్కడ ఉందని చెప్పారు రాష్ట్రానికి. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయంలో భారీ తేడా ఉందని అన్నారు. ఇలాంటి అసమానతల మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. సమాన తలసరి ఆదాయం పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు .


ఈ వార్తలు కూడా చదవండి...

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

Viral Video: వామ్మో.. పిల్లలు ఇలా తయారయ్యారేంటి? స్కూటీ పక్కకు తీయాలని చెప్పి కీస్ తీసుకుని ఓ బాలిక ఏం చేసిందో చూడండి..!

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 10 , 2024 | 04:29 PM

Advertising
Advertising