TG Assembly: అసెంబ్లీలో భూభారతి 2024 బిల్లు.. ప్రతిపక్షాల అభ్యంతరం
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:00 PM
Telangana: తెలంగాణ భూభారతి 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన ధరణి, ఆర్వోఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. దొరల గడిల్లో కూర్చుని తయారుచేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ భూభారతి 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. నాలుగు గోడల మధ్యన కూర్చొని ధరణి పోర్టల్ తెచ్చారని.. వేల పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టంతో లక్షల సమస్యలు వచ్చాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన ధరణి, ఆర్వోఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు.
Pawan Kalyan: పైపులు వేశారు.. నీటిని మరిచారు.. వైసీపీపై పవన్ ఫైర్
హరీష్ రావు తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనలను కూడా బిల్లులో పొందుపరచామన్నారు. దొరల గడిల్లో కూర్చుని తయారుచేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ముసాయిదా బిల్లును వెబ్సైట్లో పెట్టి 40 రోజులు అభిప్రాయాలు సేకరించామన్నారు. 33 జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దరావత్ రవి అనే బీఆర్ఎస్ ఎంపీటీసీ తన వద్దకు వచ్చారని.. ఆ గ్రామంలో సర్వే నంబర్ 149 నుంచి 160 లో ఉన్న భూమి ధరణి వచ్చాక అటవీ భూమిగా మార్చారని చెప్పారన్నారు. వారి స్థానిక ప్రజాప్రతినిదులకే ధరణి న్యాయం చేయలేదన్నారు. అలాంటి వారికి న్యాయం చేసేలా కొత్త చట్టం తీసుకువచ్చామని చెప్పారు. 18లక్షల ఎకరాలు పార్ట్ బిలో ఉందన్నారు. గతంలో ఆ భూమికి పాస్ బుక్కులు ఉంటే ఎందుకు పార్ట్ బి లో చేర్చారని ప్రశ్నించారు. కొత్త చట్టం ద్వారా పార్ట్ బి లోని భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
అబాది, గ్రామ కంట భూములకు పరిష్కారాలు ఈ కొత్త చట్టంలో ఉన్నాయన్నారు. పొజిషన్‌కు, పాసుబుక్కులో ఉన్న భూ విస్తీర్ణ వ్యత్యాసాలను సరిచేసే అవకాశం ఉందన్నారు. మ్యుటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో ఆధ్వర్యంలో అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారసత్వ ఆస్తుల అభ్యంతరాలపై అప్పిల్ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్రాస్ చెక్ చేసి మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీవోకి కొత్త చట్టంలో కల్పిస్తుందన్నారు. సభ్యుల నుంచి మంచి సూచనలు వస్తే ఈ బిల్లులో చేర్చడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవని స్పష్టం చేశారు. ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. ఆర్డిఓ, కలెక్టర్ అప్పీల్ అథారిటీగా ఉంటారన్నారు. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 2020 కి ముందు 9,24,000 సాధబైనామ దరఖాస్తులు చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ
సమయం ఇవ్వండి : హరీష్ రావు
ఇప్పుడే బిల్లు ప్రవేశపెట్టి ఇప్పుడే చర్చ అంటే ఎలా అని ప్రశ్నించారు. బీఏసీ మినిట్స్ రాలేదని.. ఏ బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని.. బిల్లు తమ చేతికి ఇంకా అందలేదన్నారు. బిల్లు తమ చేతికి రాకుండా బిల్లును చదవకుండా చర్చలో ఎలా పాల్గొంటామని ప్రశ్నిస్తూ.. బిల్లుపై చర్చకు సమయం ఇవ్వాలన్నారు. రెండు రోజుల ముందే బిల్లు ప్రతులను సభ్యులకు ఇవ్వాలని.. లేదంటే అభ్యంతరం తెలిపే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. ‘‘కనీసం ఒక్కరోజు ముందు కూడా బిల్లు పత్రాలు మాకు ఇవ్వలేదు మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే మేం సభ నుండి వెళ్లిపోతాం’’ అని హరీష్ రావు తెలిపారు.
రేపు చర్చ పెట్టండి..
‘‘కొత్త ఆర్వోఆర్ బిల్లుపై రేపు చర్చ పెట్టండి. ఈరోజు మేము బిల్లును చదువుకుంటాం. రేపు మాకు బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వండి’’ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనగా.. అర్థరాత్రి అజెండా పంపించడం అంటే తమ హక్కులకు భంగం కలిగించినట్లే అని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ABN Live..: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 18 , 2024 | 01:59 PM