ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Charminar Express: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం

ABN, Publish Date - Jan 10 , 2024 | 10:28 AM

Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సైడ్ వాల్‌ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు.

హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో (Nampally Railway Station) చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై (Charminar Express) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సైడ్ వాల్‌ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.


రైలు ప్రమాదం వివరాలు..

చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు నాంపల్లిలో ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్‌పారం సైడ్‌ వాల్‌‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 50 మందికి గాయాలయ్యాయి. కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చినట్టు సమాచారం. ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టు సమాచారం. డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి రైలు తాకడంతో రైలు బోగీలు ట్రాక్ మీద నుంచి కిందకి జరిగాయి.

Updated Date - Jan 10 , 2024 | 10:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising