ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

ABN, Publish Date - Feb 04 , 2024 | 03:41 PM

దేశానికే కాదు.. ప్రపంచానికే తెలంగాణ అన్నం పెడుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో 60 శాతం వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉందని చెప్పారు.

దేశానికే కాదు.. ప్రపంచానికే తెలంగాణ అన్నం పెడుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో 60 శాతం వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉందని చెప్పారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో కేంద్రం ముందే చెబితే ఆ రకాన్ని ఎక్కువగా పండించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. అయితే.. కేంద్రం బియ్యం ఎగుమతులు బ్యాన్ చేయడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని కోరారు. ఈ మేరకు 2024 జూన్ 4 నుంచి 6 తేది వరకు హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగనున్న గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఎగుమతులకు అవకాశం ఇస్తే రైస్ పాలసీ మీద పునరాలోచన చేయాలి. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరు వాడటం లేదు. భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉంది. ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని భారత్ రైస్ పేరిట 29 రూపాయలకు కేజీ ఇస్తే ఎలా..!?. సన్న బియ్యం 29 రూపాయలకు కేజీ ఇస్తే సంతోషం. తెలంగాణలో పంటలకు బీమా అవసరం. దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

- తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి


ఈ ఖరీఫ్ నుంచి పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉద్యానవన పంటలు వేయాలని రైతులను కోరారు. బియ్యం ఎగుమతులు బ్యాన్ ఎత్తివేసినా దేశంలో బియ్యం రేట్లు పెరగకుండా కేంద్రం చూడాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 03:41 PM

Advertising
Advertising