ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Laxman: 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్

ABN, Publish Date - Mar 06 , 2024 | 07:55 PM

దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్: దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయి నేతల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారని చెప్పారు. దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్లు కట్టించిన మోదీకి సొంత ఇల్లు లేదన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మన ప్రధాని మోదీదేదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్.. కొడుకునో కూతురునో ముఖ్యమంత్రి చేయడానికి పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను వంచించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇవ్వటం లేదని చెప్పారు.

అందరికీ రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆంక్షలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. 200యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితంపై మాట తప్పారని చెప్పారు. రైతు భరోసా కింద రూ. 15వేలు.. కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ హామీలు ఉంటాయని నమ్మకం లేదన్నారు. డిసెంబర్‌లోనే రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే పార్లమెంట్ ఎన్నికల్లో పని చేస్తున్నాయని అన్నారు. గడీలు బద్దలు కొట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే గడీల్లో కాంగ్రెస్ నేతలు తల దాచుకుంటూన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 07:55 PM

Advertising
Advertising