ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Oct 12 , 2024 | 10:09 AM

నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.

హైదరాబాద్, అక్టోబర్ 12: నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.

Also Read: Train Accident: గాల్లోకి ఎగిరిన బోగీలు


ఇక ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి.. శనివారం ఉదయం పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదీకాక.. ఈ రోజు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో వాహన పూజలు నిర్వహించనున్నారు. వాహన పూజ నిర్వహించేందుకు భారీగా యజమానులు తమ వాహనాలను పెద్దమ్మ తల్లి దేవాలయానికి తీసుకు వచ్చారు.

Also Read: మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం


మరోవైపు దేశవ్యాప్తంగా ఈ రోజుతో శరన్నవరాత్రులు ముగియనున్నాయి. అదీకాక నేడు దసరా పర్వదినం కావడం అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువు తీరిన దుర్గమ్మ వారు.. ఈ రోజు శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు సైతం ఈ రోజుతో ముగియనున్నాయి.

Also Read: Telangana: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..


దసరా నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైనాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, మైసూర్, విజయవాడ తదితర ప్రాంతాల్లో దసరా వేడుకలు ఘనం జరుగుతున్నాయి. దసరా వేళ.. ఈ నవరాత్రల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

For Telangana News And Telugu News..

Updated Date - Oct 12 , 2024 | 10:09 AM