ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Naveen Mittal :ధరణి పెండింగ్‌ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించండి

ABN, Publish Date - Jun 15 , 2024 | 04:48 AM

ధరణి పెండింగ్‌ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆదేశించారు. 10 రోజుల్లో పెండింగ్‌ దరఖాస్తులన్ని పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని గడువు విధించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

  • రోజుకు 100 దరఖాస్తుల పరిశీలన.. ఆమోదిస్తే ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ అప్‌లోడ్‌ చేయాలి

  • తిరస్కరిస్తే కారణాలను నమోదు చేయాలి.. సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆదేశాలు

  • తహసీల్దార్లకు అదనపు లాగిన్‌.. డిప్యూటీ తహసీల్దార్లకు వేరుగా..

  • లాగిన్లు ఇచ్చే అధికారం అదనపు కలెక్టర్లకు అప్పగింత

  • ధరణి పెండింగ్‌ దరఖాస్తులపై పలు కీలక నిర్ణయాలు

  • రోజుకు 100 దరఖాస్తుల పరిశీలన లక్ష్యం

  • రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్‌

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ధరణి పెండింగ్‌ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆదేశించారు. 10 రోజుల్లో పెండింగ్‌ దరఖాస్తులన్ని పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని గడువు విధించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్‌మిత్తల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దరఖాస్తులు వేగవంతంగా క్లియర్‌ చేసేందుకు ఎమ్మార్వోలకు అదంగా లాగిన్‌లు ఇచ్చారు. రోజుకు వంద చొప్పున పెండింగ్‌ దరఖాస్తులు పరిశీలించాలని లక్ష్యం విధించారు. పరిష్కరించిన ప్రతి దరఖాస్తుకూ ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని.. తిరస్కరిస్తే, ఎందుకు రిజెక్ట్‌ చేశారో తెలుపుతూ రిమార్కులను నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఓపెన్‌ చేసేందుకు, వాటి పరిష్కారానికి అవసరమైన రిపోర్టులు అప్‌లోడ్‌ చేసేందుకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చారు. ఇప్పటి వరకూ తహశీల్దార్లకు ఒకే లాగిన్‌ ఉండేది.

ఆ లాగిన్‌ ద్వారానే ధరణి దరఖాస్తుల పరిశీలన, రిపోర్టుల అప్‌లోడ్‌, భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేవి. ఇప్పుడు వారికి అదనంగా మరో లాగిన్‌ ఇవ్వాలని కలెక్టర్లకు మిత్తల్‌ సూచించారు. ఒక లాగిన్‌ ద్వారా ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం, మరో లాగిన్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహశీల్దార్లకు (డీటీ) ఇచ్చిన లాగిన్‌ ద్వారా ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ లాగిన్‌లు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉండేది. ఆ బాధ్యతలను నుంచి వారిని తప్పించి అదనపు కలెక్టర్లకు అప్పగించారు.


ప్రతి సమస్య పరిష్కారానికీఒక ప్రత్యేక మాడ్యూల్‌ ఉందని.. వాటి ద్వారా అన్నీ పరిష్కరించాలని సూచించారు. పరిష్కారానికి వీలులేని దరఖాస్తులు ఉంటే కారణాలు చెప్పి రిజెక్ట్‌ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రూల్‌ పొజిషన్‌కు లోబడి పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని మాడ్యూల్స్‌లో వచ్చిన దరఖాస్తులకు మాత్రమే ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి.. మిగతా దరఖాస్తులను చెక్‌లిస్టులో ఉన్న సమాచారం ఆధారంగా అప్రూవ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ విఽధానానికి స్వస్తి పలికి.. ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేసే విధానాన్ని తీసుకొచ్చారు.

  • ఇదీ లెక్క..

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పెండింగ్‌ దరఖాస్తులు దాదాపు 3 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 45 వేలు, సంగారెడ్డి జిల్లాలో 20 వేలు, వికారాబాద్‌ జిల్లాలో 17 వేలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 12 వేలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 వేలు, మేడ్చల్‌ మల్కాజిరిగి జిల్లాలో 11,500, మహబూబ్‌నగర్‌లో 6,500 చొప్పున ధరణి పెండింగ్‌ దరఖాస్తులు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా పెండింగ్‌ దరఖాస్తులు భారీగానే ఉన్నాయి.

  • రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు

మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ(ధరణి) ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్‌ పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టామని అన్నారు. సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యేలా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.

ఈ మేరకు ధరణి పోర్టల్‌పై అధ్యయనానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధరణి పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని తెలిపారు.

భూవివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ధరణి కమిటీ సిఫారసు చేసిందని చెప్పారు.

ధరణి అమలుతో వచ్చిన సమస్యలకు సంబంధించి కమిటీ చేసిన సిఫారసులపై చర్చించామని చెప్పారు. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించే ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఽసామాన్య ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేపట్టబోతున్నామని చెప్పారు.

Updated Date - Jun 15 , 2024 | 04:48 AM

Advertising
Advertising