TS GOVT: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు.. ఎందుకంటే..?
ABN, Publish Date - Jan 08 , 2024 | 08:24 PM
తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తాకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ( NHRC ) నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో జనవరి 5వ తేదీన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తాకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ( NHRC ) నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో జనవరి 5వ తేదీన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం కేసును సుమోటగా ఎన్‌హెచ్ఆర్సీ స్వీకరించింది. నాలుగు వారాల్లోగా విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని, తెలంగాణ డీజీపీని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది. పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. ఈ సంఘటనకు బాధ్యులైన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో చేర్చాలని ఎన్‌హెచ్ఆర్సీ డీజీపీని ఆదేశించింది.
Updated Date - Jan 08 , 2024 | 08:24 PM