ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: జరీన్‌కు నియామక పత్రం అందజేత

ABN, Publish Date - Sep 18 , 2024 | 09:44 PM

బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చింది. జరీన్‌ను డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ జితేందర్ నియామక పత్రాన్ని అందజేశారు.

Nikhat Zareen Get DSP Job

హైదరాబాద్: బాక్సర్ నిఖత్ జరీన్‌కు (Nikhat Zareen) తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. జరీన్‌ను డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ జితేందర్ నియామక పత్రాన్ని అందజేశారు. జరీన్ మూడేళ్లపాటు ప్రొబెషనరీ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 క్యాడర్ ఉద్యోగం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇందూరు బిడ్డ..

ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ విభాగంలో వరల్డ్ చాంపియన్ షిప్‌ను నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ సాధించారు. గత ప్రభుత్వం జరీన్‌కు నజారానా ప్రకటించింది. నివాస స్థలం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు అందజేసింది. గ్రూప్-1 క్యాడర్ ఉద్యోగం ఇస్తామని రేవంత్ ప్రభుత్వం మాట ఇచ్చి నిలబెట్టుకుంది. గత నెల 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సెక్షన్ 4లో తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్ మెంట్స్‌కు సవరణ చేసింది. నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇవ్వాలని హోం శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ డీఎస్పీగా నియమించింది.


రెండుసార్లు టైటిల్

నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2023, 2022లో కూడా టైటిల్ నెగ్గింది. కామన్వెల్వ్ గేమ్స్‌లో స్వర్ణం, ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిరాశ పరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్స్‌లో వెనుదిరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Sep 18 , 2024 | 09:48 PM

Advertising
Advertising