ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: కరోన తర్వాత పరిస్థితులు మారాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 25 , 2024 | 08:45 PM

కరోన తర్వాత పరిస్థితులు మారాయని.. అధునాతన వైద్యం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని నటుడు, జనసేన వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆదివారం నాడు హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో ఘనంగా ‘‘హెల్త్ ఆన్ అస్ మొబైల్ యాప్’’ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

హైదరాబాద్: కరోన తర్వాత పరిస్థితులు మారాయని.. అధునాతన వైద్యం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని నటుడు, జనసేన వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆదివారం నాడు హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో ఘనంగా ‘‘హెల్త్ ఆన్ అస్ మొబైల్ యాప్’’ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ యాప్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తానని తెలిపారు. ఈ యాప్ వెనుక ఎంతో కృషి ఉందని చెప్పారు. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో టీం ముందుకు వెళ్తుందన్నారు. మెడికల్ ఎక్స్‌ఫర్ట్ అందరూ కలిసి ఈ యాప్‌ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కోవిడ్ తర్వాత ఇంటివద్దే మెడికల్ కేర్ కావలనుకుంటున్నారని చెప్పారు. జనాభా పెరుగుదలతో పాటు మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ యాప్ ద్వారా వైద్యం కోసం బుక్ చేసుకుంటే డాక్టర్స్‌, మెడికల్ కేర్ ఇంటికి వస్తాయని చెప్పారు.

వైద్య విద్యార్థులు ఎంతో మందికి ఇలాంటి యాప్‌లు ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవచ్చని. ఇలాంటి యాప్‌లు ఉపాధి చూపిస్తాయని వివరించారు. ఆస్పత్రిలో బెడ్ కావాలంటే ఒక్కోసారి మంత్రుల రికమెండేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రులు అంత బిజీగా ఉంటున్నాయని చెప్పారు. కోవిడ్ సమయంలో మా అమ్మకి బాగలేకపోతే తాను ఆస్పత్రికి తీసుకెళ్లానని తెలిపారు.అప్పుడు ఇంటికే వైద్య సేవలు ఉంటే బావుండు అనిపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 08:45 PM

Advertising
Advertising