PM Modi: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
ABN, Publish Date - Apr 24 , 2024 | 11:44 AM
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 30, మే 3, 4 తేదీలలో మోదీ పర్యటించనున్నారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections)పై బీజేపీ (BJP) దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 30, మే 3, 4 తేదీలలో మోదీ పర్యటించనున్నారు. ఈనెల 30న హైదరాబాద్‌లోని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కానున్నారు. మే 4వ తేదీన నారాయణ పేట్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
రేపు రాష్ట్రంలో పర్యటించనున్న అమిత్ షా
కాగా పార్లమెంట్ ఎన్నికలపై (Parliament Elections) కమలం పార్టీ (BJP) సీరియస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ (Telangana)లో బీజేపీ అగ్రనేతలు (BJP Top leaders) వరసగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. రేపు మధ్యహాన్నం 12 గంటలకు సిద్దిపేట (Siddipet)లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మెదక్ (Medak) బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘనందనరావు (Raghunandanarao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
కాగా గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. గురు, శుక్రవారాలు బన్సల్ తెలంగాణలో పర్యటిస్తారని పెద్ద సభలు, సమావేశాల కంటే డోర్ టు డోర్ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మే నెల 13వ తేదీ వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం సాగుతుందని చెప్పారు.
ఎన్నిలకు కేవలం రెండు వారాలు ఉండడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి పెట్టింది. వరుసగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి మూడు లేదా నాలుగు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. సిద్ధిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వం: సురేంద్రబాబు
డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు
కడప జిల్లా కోర్టు గీత దాటింది!
Read Latest AP News and Telugu News
National News, Telangana News, Sports News
Updated Date - Apr 24 , 2024 | 11:52 AM