TS News: నెల రోజుల కాంగ్రెస్ పాలనపై కోదండరాం ఏమన్నారంటే..
ABN, Publish Date - Jan 12 , 2024 | 01:51 PM
హైదరాబాద్: నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు.
హైదరాబాద్: నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు. ఆంక్షలు బద్దలయ్యాయని.. ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్ధతి బాగుందని.. జీతాలు సమయానికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, అన్ని అంశాలపై సమీక్షలు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ప్రభుత్వం ఎత్తేస్తుందని, ఉద్యమ కేసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
Updated Date - Jan 12 , 2024 | 01:51 PM