ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Highcourt: హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ పాకాల

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:41 PM

Telangana: జన్వాడ ఫామ్‌ హౌస్ కేసులో రాజ్ పాకాల.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు రాజ్ పాకాల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.

Raj Pakala approached the Telangana High Court

హైదరాబాద్, అక్టోబర్ 28: జన్వాడ్ ఫాంహౌస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు. సోమవారం హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.

Sakshi Bad Manner: వెంటాడుతున్న కొద్దీ వెన‌క్కి పారిపోతున్న సాక్షి భూతం..



మరోవైపు ఫామ్ హౌస్ ఘటన అనంతరం రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఫోన్‌ కూడా స్విచ్‌ఆఫ్ చేసినట్లు సమాచారం. ఫోన్ సిగ్నల్ ద్వారా రాజ్‌ పాకాల ఆచూకిీ కనుగొని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ఫోన్‌‌ను కూడా రాజ్‌ పాకాల స్విచ్‌ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజ్‌పాకాల హైదరాబాద్‌లోనే ఉన్నారా లేక వేరే ఎక్కడికైనా వెళ్లిపోయారా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు అయినందున అందుకు అనుగుణంగానే రాజ్‌ పాకాలను విచారించాలని పోలీసులు భావించగా.. అప్పటికే ఆయన కనిపించకుండా పోయారు.


ఈ క్రమంలో నిన్ననే రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇవ్వాలని భావించినప్పటికీ.. తాను విచారణకు సహకరిస్తానని.. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని రాజ్‌ పాకాల చెప్పినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసులు వెనుదిగారు. అయితే సాయంత్రం వరకు రాజ్‌ పాకాల కోసం పోలీసులు ఎదురు చూసినప్పటికీ ఆయన రాకపోవడంతో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రాజ్ పాకాల అందుబాటులో లేని నేపథ్యంలో ఆయన నివసించే విల్లా గోడకు నోటీసును అంటించారు. ఈరోజు ఉదయం విచారణకు రావాలని పోలీసులు స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు రాజ్‌ పాకాల విచారణకు హాజరుకాని పరిస్థితి. ప్రధానంగా ఈ కేసులో రాజ్ పాకాల కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయనను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.


అలాగే ఆ పార్టీ డ్రగ్స్ సంబంధించి ఓ వ్యక్తికి పాజిటివ్‌ కూడా వచ్చింది. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లుగా తేలింది. దీంతో ఆ వ్యక్తికి కొకైన్ ఎవరిచ్చారు అనే అంశాలపై విజయ్‌ను పోలీసులు విచారించగా.. రాజ్ పాకాల కొకైన్ ఇచ్చినట్లు అతడు స్టేట్‌మెంట్‌లో చెప్పాడు. ఈ క్రమంలో రాజ్‌ పాకాలకు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తేలాల్సి విషయం. ఈ విషయాలపై రాజ్‌ పాకాలను విచారించాలని మోకిలా పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే పార్టీలో పాల్గొన్న మిగిలిన వారికి కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. పార్టీలో పలువురు మహిళలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారంతా కూడా ముందుగా డ్రగ్స్ టెస్ట్‌ చేయించుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారికి కూడా మరోసారి డ్రగ్స్ టెస్టులు నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. విచారణకు హాజరుకాని పక్షంలో కచ్చితంగా రాజ్ పాకాలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్‌ పాకాల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

జగన్‌కు సలహాదారును

KTR: నీ సావు తెలివితేటలతో.. బంగారు తెలంగాణ బక్కచిక్కిపోతోంది

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 12:48 PM