HMDA: ఏబీఎన్ చేతిలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్ట్..
ABN, Publish Date - Jan 27 , 2024 | 03:13 PM
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 27: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (HMDA Former Director Shiva Balakrishna) ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. 45 పేజీల రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం ఏబీఎన్ చేతికి చిక్కింది. శివ బాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ పేర్కొంది. 1994లో గ్రూప్1 క్యాడర్‌లో సర్వీస్‌లోకి వచ్చిన శివ బాలకృష్ణ.. అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా బాలకృష్ణ విధులు నిర్వహించారు.
రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయంటూ బాలకృష్ణ లాభాలు పొందినట్లు తెలిపారు. ప్లాట్‌లలో, నిర్మాణాల్లో, విల్లాలను కూడా లంచంగా తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని... హెచ్‌ఎండీలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించినట్లు తెలిపారు. బాలకృష్ణ సుదీర్ఘంగా కీలక పోస్ట్‌లో పనిచేశాడు. మరోవైపు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్లను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. బాలకృష్ణకు సహకరించిన అధికారులపై కూడా ఏబీసీ విచారణ జరుపనుంది.
రిమాండ్ రిపోర్ట్.. మరింత క్లుప్తంగా...
శివ బాలకృష్ణ ఇల్లు సహా 18చోట్ల ఏసీబీ సోదాలు
భారీగా ఆస్తుల గుర్తించాం.50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు స్వాధీనం.
4.9కోట్లు స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్థులు.
డాక్యుమెంట్ల ప్రకారం 10 కోట్లు ఆస్తుల విలువ, బహిరంగ మార్కెట్‌లో 10రె ట్లు ఎక్కువ.
పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్‌లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్.
నాగరకర్నూల్‌లో 12.13 ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్, భూములు, ప్లాట్స్.
99లక్షల నగదు, నాలుగు కార్ల విలువ రూ.51లక్షలు, బ్యాంకు బాలెన్స్ రూ.58 లక్షలు
గోల్డ్ , సిల్వర్, వాచ్‌లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వాల్యూ రూ.8కోట్ల 26లక్షలు
రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెట్ 120 హ్యాండ్ వాచ్‌లు స్వాధీనం, వాటి విలువ రూ.32లక్షలు
ఆపిల్ ఫోన్స్, ట్యాబ్స్ 31 స్వాధీనం. వాటి విలువ రూ.15 లక్షలు
పలు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా ఏసీబీ సోదాలు
సాయి సందీప్ ఇన్ఫ్రా, క్వారిజన్ స్పేస్, ఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్, పలు ఇన్ఫ్రా కంపెనీలపై సోదాలు
ఉప్పల్‌లో సోదరి, కొర్రేములలో సోదరులు, హిమాయత్‌నగర్‌లో బామ్మర్ది నివాసంలో ఏసీబీ సోదాలు
155 డాక్యుమెంట్ షీట్స్, 4 పాస్‌బుక్‌లు స్వాధీనం
ఎల్‌ఐసీ పాలసీ బాండ్స్ 20 స్వాధీనం
ఐటీ రిటర్నస్ డాక్యుమెంట్లు స్వాధీనం
నాలుగు బ్యాంకు సాస్‌బుక్స్, లాకర్స్ స్వాధీనం
బినామీలను విచారించాల్సి ఉందన్న ఏసీబీ
పలువురు బినామీలను గుర్తించిన ఏసీబీ
ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్‌లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాల్లో సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 27 , 2024 | 03:22 PM