Hyderabad: గ్రాండ్‌గా సదర్ సెలబ్రేషన్స్..
ABN, Publish Date - Nov 02 , 2024 | 05:04 PM
సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగర శివారులో మొత్తం 40 ప్రాంతాల్లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో హర్యానా దున్న రాజులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ : సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సదర్ సెలబ్రేషన్స్ గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగర శివారులో మొత్తం 40 ప్రాంతాల్లో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో హర్యానా దున్న రాజులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దున్నపోతులతో యాదవులు సదర్ విన్యాసాలు చేయిస్తున్నారు. పంజాగుట్ట, ఎల్లారెడ్డి గూడ, ఖైరతాబాద్, కొత్తపేట, బోయిన్ పల్లి, సైదాబాద్‌లో సదర్ సమ్మేళనాలు జోరుగా కనిపిస్తున్నాయి. అసలు ఈ సదర్ అంటే అర్థం ఏంటి? సదర్ వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
యాదవుల సాంస్కృతి:
యాదవులు సాంస్కృతిక ప్రతీకగా సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. యాదవులు ప్రతి యేటా దీపావళి సందర్బంగా సదర్ సమ్మేళనం జరుపడం అనవాయితీ. హైదరాబాద్ లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఈ ఉత్సవం ఒకటి. నగరంలోని యదవులు మాత్రమే సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీపావళి ముగిసిన రెండు రోజులకు ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. దీన్ని దున్నపోతుల ఉత్సవం అని కూడా అంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం సదర్ ఉత్సవం ప్రత్యేక విశేషం.
సింధు నాగరికత:
ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి యాదవులు ఈ సదర్ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. సింధు నాగరికతలో భాగంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చరిత్రకారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈ ఉత్సవాలు దేవగిరి యాదవ రాజుల కాలంలో వ్యాప్తి చెందాయని.. వీరు కాకతీయుల కన్నా ముందే గొల్లకొండగా పిలిచే ప్రస్తుత గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవారని చరిత్ర చెబుతోంది. తర్వాతి కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని పాలించే యాదవుల రాణి కుతుబ్ షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని పోరాడి వీర మరణం పొందిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దున్నపోతుల వీరత్వానికి ప్రతీకగా సదరు ఉత్సవాలు జరుపుతున్నట్లు చరిత్ర తెలుపుతోంది. నిజాంముల కాలంలో యాదవ వీరులు సైనికాధికారులుగా, అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేశారని తెలుస్తోంది.
Also Read: For More National News and Telugu News..
సామాన్యుడి కోసం బీఎస్‌ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేయిస్తే సంవత్సరమంతా ఫ్రీ
అర్ధరాత్రి పోలీసులకు ఫోన్.. చోరీ జరిగిందని వచ్చిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే షాక్..
గోరంట్ల మాధవ్‌వి అమానవీయ వ్యాఖ్యలు.. వాసిరెడ్డి పద్మ షాకింగ్ కామెంట్స్
Updated Date - Nov 02 , 2024 | 05:12 PM